
రేపు పేద ప్రజల సొంతింటి కల నెరవేరే రోజు అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల 75 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు. 15 లక్షల ఇళ్ల పనులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ పాల్గొంటారని బొత్స ప్రకటించారు. 2.62 లక్షల మందికి టిడ్కో ఇళ్లు ఇస్తామని తెలిపారు. కొత్త లేఔట్లతో 17 వేల కొత్త గ్రామాలు తయారవుతాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మనుషులు కోర్టులకు వెళ్లడం వల్ల ఆలస్యమైందని, 23 వేల కోట్ల విలువైన భూములను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలోనే 1350 కోట్ల విలువైన 4457 ఎకరాలు పంపిణీ చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.