
కరోనా వ్యాక్సిన్ సిద్ధంగా ఉందని, అయితే వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని నిర్ధారించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంగళవారం భారత ప్రధాన మంత్రి మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన సందర్భంగా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. శాస్త్రీయంగా ఆమోదించబడిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యాక్సిన్ ను ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్ దేశమంతటా ఒకే విధంగా ప్రభావం చూపలేదన్నారు. ఈ నేపథ్యంలో మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలన్నారు. పది, పదిహేను రోజుల పరిస్థతిని పరిశీలించి ఆ తరువాత మిగతా వారి కోసం వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలన్నారు.