’దేవిప్రియ‘మృతికి కేసీఆర్ సంతాపం

ప్రజా కవి దేవిప్రియ శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మ్రుతికి సంతాపం వ్యక్తం చేశారు. అలాగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటి గటంటకు ఆయన అంత్యక్రియలు తిర్మలగిరి శ్మశాన వాటికలో జరగనున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన దేవి ప్రియ జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ […]

Written By: Suresh, Updated On : November 21, 2020 12:37 pm
Follow us on

ప్రజా కవి దేవిప్రియ శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మ్రుతికి సంతాపం వ్యక్తం చేశారు. అలాగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒంటి గటంటకు ఆయన అంత్యక్రియలు తిర్మలగిరి శ్మశాన వాటికలో జరగనున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన దేవి ప్రియ జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. కానీ ‘దేవిప్రియ’కలం పేరుతో రచనలు చేశారు. దేవి ప్రియ ‘ఉదయం’ సహా పలు పత్రికల్లో పనిచేశారు. అమ్మచెట్టు, నీటి పుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు వంటి పలు రచనలు చేశారు. 2017లో ఆయనను కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమితో సత్కరించింది.