
కేసీఆర్ లాంటి నాయకుడి కోసం దేశం ఎదురుచూస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లడుతూ తెలంగాణలో మత రాజకీయాలు పనిచేయవన్నారు. కేంద్రం నల్లధనాన్ని తీసుకొస్తానని చెప్పి.. నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. అందరి అకౌంట్లలో రూ. 15 లక్షల చొప్పున జమ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన బీజేపీ ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.