
కరోనా నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించేలా సీఎం కేసీఆర్ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణారావును ఆదేశించారు. ఉద్యోగుల వేతనాల్లో రెండు నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తం చెల్లించాలన్నారు. ఆదివారం ప్రగతిభవన్ లో ఆర్టీసీపై కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన వాటిని చెల్లించేందుకు తక్షణమే రూ.120 కోట్లు విడుదల చేయాలన్నారు. ఇక హైదరాబాద్ లో 50 శాతానికి పై గా బస్సు సర్వీసులను పెంచాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటుందన్నారు.