
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక లిస్ట్ లో పేరు లేకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన చెందారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వెళ్లగక్కారు. సోనియాగాంధీకి పంపించిన లిస్ట్‌లో తన పేరు లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు 2017లో కోట్లు ఖర్చు పెట్టి సంగారెడ్డిలో రాహుల్‌గాంధీతో భారీ బహిరంగ సభ పెట్టినట్లు గుర్తుచేశారు. ఇంత చేసినా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చర్చలో తన పేరు లేకపోవడం చాలా బాధ అనిపించిందన్నారు. కొత్తగా వచ్చిన ఇంఛార్జ్ తన కార్యక్రమాల గురించి తెలుసుకోకపోవడం.. తనలాంటి ఆర్గనైజర్ పేరు ఢిల్లీ లిస్ట్‌లో పంపకపోవడం బాధకు గురిచేసిందని తీవ్ర మనోవేదనకు గురయ్యారు.