
ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న తరుణంలో కొందరు ‘క్యాష్’ చేసుకుంుటన్నారు. బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకుల జేబులు కొల్లగొడుతున్నారు. తాజాగా ఖమ్మంోలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు నగర్ ఏసీపీ వెకంట్రావ్ తెలిపారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఆయన ఆధ్వర్యంలో సీఐ వెంకట్రావ్, ఎస్ఐలతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. ఖమ్మం నిజాంపేట్ సమీపంలో దాడులు నిర్వహించగా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈసారి ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి రూ. 3 లక్షల 58 వేల లావాదేవీలు కొనసాగించారని ఆయన పేర్కొన్నారు.