
హైదరాబాద్ లో గుంతలు లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. గతంలో రోడ్లపై గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తానని టీఆర్ఎస్ చాలెంజ్ చేసిందని, ఇప్పుడు గుంతలు లేని రోడ్డు చూపిస్తే లక్ష ఇస్తానన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇళ్లను ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు.హైదరాబాద్ సముద్రంగా కావడానికి ఈ ప్రభుత్వమే కారణమన్నారు. ప్రజల విశ్వాసాన్ని సీఎం ఎప్పుుడో కోల్పోయారన్నారు. హైదరాబాద్ ను డల్లాస్గా మారుస్తానని చెప్పిన సీఎం హామీ ఏమైందన్నారు.