
సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపపంచంలో హైదరాబాద్ కు రెండో స్థానం దక్కింది. మొదటిస్థానం తమిళనాడులోని చెన్నై సొంతం చేసుకోగా రెండో స్థానంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నిలచింది. ఇటీవల ‘సర్ఫ్ షార్క్’ ప్రపంచవ్యాప్తంగా చదరపు కిలోమీటర్ కు ఉన్న సీసీ కెమెరాల నివేదికలను వెలవరించింది. ఈ నివేదికలో ప్రపంచంలోని టాప్ 10 నగరాలను ప్రకటించింది. ఇందులో అతిపెద్ద నగరాల లకంటే ముందందజలో హైదరాబాద్ కు స్థానం దక్కింది. కాగా తెలంగాణ వ్యాప్తంగా 6.65 లక్షల సీసీ కెమెరాలు ఉండగా కేవలం హైదరాబాద్ లోనే 6 లక్షల వరకు ఉన్నాయి.