
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండలో చెరుకు తోటలో విద్యుదాఘాదంతో భార్యభర్తలు మృతి చెందారు. తమ చెరుకుతోటలో జడలు వేస్తుండగా తెగిన విద్యుత్ వైరు తగిలి తెలగమళ్ల ఆనందరావు, తెలమళ్ల పార్వతిలు అక్కడికక్కడే మృతి చెందారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. గురువారం వర్షం తగ్గడంతో చెరుకు నరికి ఫ్యాక్టరీ తరలించేందుకు కూలీలను కూడా వీరు తీసుకెళ్లారు. అయితే కూలీల కంటే ముందుగా వారు చెరుకుతోటకు వెళ్లి జడలు వేస్తుండగా విద్యుదఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. సమంచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.