
మెగా మేనల్లుడు ‘సాయి ధరమ్ తేజ్’ రీల్ లైఫ్ లో ఎంత సరదాగా ఉంటాడో.. రియల్ లైఫ్ లోనూ అంతే సరదాగా ఉంటాడు. అందుకే తేజ్ ఎప్పుడూ కూల్ గా ఫ్రెండ్లీగా హంబుల్ గా ఉంటాడంటూ తోటి నటీనటులు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అయితే తేజ్ లో కాస్త చిలిపితనం కూడా ఎక్కువే ఉందట. సెట్ లో యాక్టర్స్ తో పాటు హీరోయిన్స్ ను కూడా ఎప్పటికప్పుడు ఆట పట్టిస్తుంటాడట. తేజ్ ఉంటే సెట్ అంతా సందడిగా ఉంటుందని అందుకే హీరోయిన్స్ కూడా ఇంటర్వ్యూల్లో ఓపెన్ గా చెబుతుంటారు. తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నాను తేజ్ ఆట పట్టించాడు. నేడు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు. మరి హీరోగారి పుట్టినరోజుకు, హీరోయిన్ శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా.. అందుకే రాశీ ఖన్నా ఓ వీడియోను షేర్ చేస్తూ తేజ్ కు బర్త్ డే విషెస్ చెప్పింది.
Also Read:కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..!
కాగా ఈ వీడియోలో రాశీ ఖన్నాను తేజ్ బాగానే ఆట పట్టించాడు. సహజంగా అమ్మాయిలకు సెల్ఫీ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి.. రకరకాల పోజులు పెడతారు. మరీ హీరోయిన్స్ ఇక ఏ రేంజ్‌లో పోజులిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా తేజ్ సెల్ఫీ తీస్తున్నాడు అనుకుని.. రాశీ ఖన్నా కూడా మంచి పోజిచ్చి సెల్ఫీ కోసం ఎదురుచూస్తూ ఉంది. కానీ తేజ్ ఎంతకీ ఫోటో తీయకపోవడంతో.. మ్యాటర్ అర్థమై అది ఫోటో కాదు వీడియో అంటూ రాశి అరవడంతో, సుప్రీం హీరో ఫక్కున నవ్వేశాడు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక రాశి, తేజ్ కి మెసేజ్ చేస్తూ.. ‘నా క్రేజీ ఫ్రెండ్ కు హ్యాపీ బర్త్ డే.. ఈ ప్రపంచంలోని సంతోషం అంతా నీ వద్దే ఉండాలి’ అంటూ ఓ రేంజ్ లో విషెస్ తెలిపింది.
Also Read: ఒగ్గేసిపోకే అమృత.. అంటూ విరహాగీతం పాడుతున్న మెగాహీరో..!
రాశి – తేజ్ మంచి స్నేహితులు. వీరిద్దరు గతంలో ‘సుప్రీమ్, ప్రతిరోజూ పండగే’ లాంటి చిత్రాలలో నటించి లక్కీ పెయిర్ అని నిరూపించుకున్నారు. ఇక తేజ్ కూడా ప్రసుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తనకంటూ ఓ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా షూట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కరోనా రోజురోజుకూ పెరుగుతున్నా.. అందరి హీరోల కంటే ముందుగానే సాయి తేజ్ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాడు. అలాగే తేజ్ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు, ఆ మధ్య తేజే స్వయంగా సోషల్ మీడియాలో ఇన్ డైరెక్ట్ గా ఓ మెసేజ్ కూడా పెట్టాడు.
