
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాకినాడ వద్ద తీరం దాటడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం విశాఖపట్నం మీదుగా కాకినాడ నంచి తెలుగు రాష్ట్రాలోకి ఈదురుగాలులు దూసుకొచ్చాయి. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు గూసుకొస్తున్నాయిన వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలోని వరంగల్‌లో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం సూచించారు. అటే అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.