
భద్రాద్ది కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. సోమవారం భద్రాచలం వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా భారీ ఎత్తున పట్టుబడింది. ఈ సందర్భంగా 1,256 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.89 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని సీలేరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు.