
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకున్నది. మొత్తం 150 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం.కరోనా భయం, వరుసగా సెలవులు రావడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండటంతో నగరవాసులు ఓటు వేయడానికి రాలేకపోయారని అంచనా వేస్తున్నారు. ఈ సారి యువతకు పోటీగా వృద్ధులు, వికలాంగులు ఓటు వేయడానికి కేంద్రాలకు తరలివచ్చారు. పలు చోట్లు పలు పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.