Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్'మహిళా సంఘాలకు శుభవార్త '

‘మహిళా సంఘాలకు శుభవార్త ‘

Errabelli

రాష్ట్రవ్యాప్త మహిళా సంఘాల సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుభవార్త చెప్పారు. స్త్రీ నిధి సురక్ష- బి అనే పథకం అమలుకు నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అర్హత గల ప్రతి సభ్యురాలు మూడు ఏండ్లకు ఒక్కసారి 690 రూపాయలను ప్రీమియంగా చెల్లించాలి. ఈ నిధి మొత్తాన్ని తిరిగి సులభ వాయిదాల్లో చెల్లించే విధంగా మహిళలకే రుణంగా అందిస్తారు. ఈ పథకంలో చేరిన సభ్యురాలు మరణిస్తే రూ. లక్ష వరకు సభ్యురాలి వారసులకు చెల్లిస్తారన్నారు. మహిళలందరికీ తాను చెప్పేది ఒక్కటేనని మహిళలు అభివృద్ధి చెందితే ఆ కుటుంబంతో పాటు, సమాజం, గ్రామం, దేశం కూడా బాగుపడుతుందన్నారు.

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version