https://oktelugu.com/

రిజిస్ట్రేషన్ ఓ ప్రసహనం.. ప్రజల్లో అసహనం

తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. అవినీతికి తావులేని విధానాాన్ని తీసుకొస్తామంటూ మూడు నెలల క్రితం రిజిస్ట్రేషన్లు ఆపేసిన ప్రభుత్వం.. కోర్టు అడ్డంకుల నేపథ్యంలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. కానీ.. కొత్త పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. అయితే.. సాఫ్ట్‌వేర్‌ సరిగా స్పందించకపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. Also Read: తిరుపతితోపాటే ‘సాగర్’కు ఉప ఎన్నిక..? రోజుకు పదీ పదిహేనే.. ఈ కొత్త విధానంలో స్లాట్ల బుకింగే పెద్ద సవాల్‌గా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 / 07:42 PM IST
    Follow us on


    తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఓ ప్రహసనంగా మారింది. అవినీతికి తావులేని విధానాాన్ని తీసుకొస్తామంటూ మూడు నెలల క్రితం రిజిస్ట్రేషన్లు ఆపేసిన ప్రభుత్వం.. కోర్టు అడ్డంకుల నేపథ్యంలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. కానీ.. కొత్త పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. అయితే.. సాఫ్ట్‌వేర్‌ సరిగా స్పందించకపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది.

    Also Read: తిరుపతితోపాటే ‘సాగర్’కు ఉప ఎన్నిక..?

    రోజుకు పదీ పదిహేనే..
    ఈ కొత్త విధానంలో స్లాట్ల బుకింగే పెద్ద సవాల్‌గా మారింది. మూడునెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో.. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న జనం త్వరగా పని పూర్తికావాలనే ఆరాటంలో ఉన్నారు. దీంతో.. సహజంగానే స్లాట్లకు ఎక్కువ డిమాండ్ పెరిగింది. కానీ.. రోజుకు పదుల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయలేకపోతున్నారు. రిజిస్టేషన్ల కోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చిన వారంతా.. కొత్త నిబంధనలను చూసి తర్వాత చూద్దాం బాబోయ్‌ అంటూ తిరిగిపోతున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లకు కూడా అంతుబట్టకుండా ఉన్న సాఫ్ట్‌వేర్‌తో రిజిస్ట్రేషన్లు మందగించాయి.

    Also Read: కాళీమాత, ఎంఐఎం.. అగ్గిరాజేసిన రాజాసింగ్

    పాత పద్ధతినే పాటించాలని..
    ఇలాంటి పరిస్థితుల్లో పాత విధానంలో రిజిస్ట్రేషన్లు చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పలు చోట్ల.. ధర్నాలు కూడా చేస్తున్నారు. కొత్త విధానంలో రిజస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ లో హద్దులు చూపకపోవడం, లింక్ డాక్యుమెంట్ లేకపోవడం వంటివి గందరగోళానికి గురి చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో.. సీఎం కేసీఆర్‌ ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు, బిల్డర్లు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలను ఉప సంఘం సేకరించి, పరిష్కార మార్గాలను సూచించాల్సి ఉంది. ఈ కమిటీ నివేదిక తర్వాత ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి, ఉప సంఘం ఏం చెబుతుంది? ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఎటువైపు తిరుగుతుంది అన్నది చూడాలి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్