పాయ‌ల్ రాజ్ పుత్.. అన‌గ‌న‌గా ఓ అతిధి

ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప‌త‌కాం పై టాలెంటెడ్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ముఖ్య పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం అన‌గ‌న‌గా ఓ అతిధి. ఈ సినిమాలో పాయ‌ల్ తో పాటు యువ క‌థనాయ‌కుడు చైత‌న్య కృష్ణ, న‌టులు ఆనంద్ చ‌క్ర‌పాణి, వీణ సుంద‌ర్ త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. Also Read: కరోనా కంటే.. బాలయ్యే ఎక్కువ భయపెడుతున్నాడు ! ద‌యాల్ ప‌ద్మనాభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా […]

Written By: NARESH, Updated On : November 17, 2020 11:50 am
Follow us on


ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప‌త‌కాం పై టాలెంటెడ్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ముఖ్య పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం అన‌గ‌న‌గా ఓ అతిధి. ఈ సినిమాలో పాయ‌ల్ తో పాటు యువ క‌థనాయ‌కుడు చైత‌న్య కృష్ణ, న‌టులు ఆనంద్ చ‌క్ర‌పాణి, వీణ సుంద‌ర్ త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Also Read: కరోనా కంటే.. బాలయ్యే ఎక్కువ భయపెడుతున్నాడు !

ద‌యాల్ ప‌ద్మనాభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని రాజా రామ్ మూర్తి, చిదంబ‌రం న‌టీస‌న్ నిర్మించారు. అనుకోని ప‌రిస్థితుల్లో ఓ అర్ధ‌రాత్రి ఓ ఇంటికి వ‌చ్చిన అతిధి కార‌ణంగా ఎదురైయ్యే స‌మ‌స్య‌లు క‌థాంశంగా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ద‌యాల్ అత్యంత ఉత్కంఠ క‌లిగేలా రూపొందిచారు.

Also Read: హోస్ట్ గా ఒకప్పటి హాట్ హీరోయిన్.. !

ఆరెక్స్ 100 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్, ఆర్ డి ఎక్స్ ల‌వ్, డిస్కోరాజా సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ సోంత‌ ఇమేజ్ తెచ్చుకున్న పాయల్ ఇప్పుడు అన‌గ‌న‌గా ఓ అతిధితో మ‌రోసారి ఆడియెన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి రెడీ అవుతుంది. ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ స్లేట్ లో ప్ర‌ముఖ తెలుగు ఓటిటి ఆహాలో  నవంబ‌ర్ 20న విడుద‌ల అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్