ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలున్నాయి : మంత్రి ఈటల

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌బారిన పడ్డ వారిని ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని డిమాండ్లు వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో ఈ పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్పొరేట్‌లో లాభదాయంగా ఉన్న రోగాలనే చికిత్సచేస్తున్నారని, రోగులను రిజెక్టు చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నాఉ. గాంధీ మినమా […]

Written By: NARESH, Updated On : October 5, 2020 4:03 pm
Follow us on

తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌బారిన పడ్డ వారిని ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని డిమాండ్లు వస్తున్నాయని, ఇలాంటి తరుణంలో ఈ పథకంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్పొరేట్‌లో లాభదాయంగా ఉన్న రోగాలనే చికిత్సచేస్తున్నారని, రోగులను రిజెక్టు చేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నాఉ. గాంధీ మినమా అన్ని ఆసుపత్రుల్లో ఇతర సాధారణ సేవలు మొదలయ్యాయని, కోవిడ్‌ డ్యూటీలో ఉన్న వాళ్లకు మాత్రమే క్వారంటైన్‌ సెలవులు ఇస్తామని అన్నారు.