
‘చంద్రబాబు ఇజ్జత్ పాయే..’ ఏపీ అసెంబ్లీ సాక్షిగా.. ఏపీ ప్రజలందరూ చూస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు పరువును గంగలో కలిపేశారు సీఎం జగన్. ఆ వీడియోను ప్రదర్శించి నవ్వుల పాలు చేశారు. చంద్రబాబు వీడియోను ప్లే చేయగా.. దాన్ని చూసి జగన్ పొట్టచెక్కలయ్యేలా నవ్వి నవ్వి చివరకు ఆ కామెడీ భరించలేక వీడియోను ఆపు చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఏపీ అసెంబ్లీ సాక్షిగా పునరావృతమైంది.
Also Read: మళ్లీ ఫాంలోకి వైసీపీ సోషల్ మీడియా సైన్యం
సీఎం జగన్ తాజాగా అసెంబ్లీలో పోలవరం కోసం చంద్రబాబు 83 కోట్లు ఖర్చు పెట్టాడని.. మహిళలను బస్సుల్లో తీసుకుపోయి ఏం చేశాడో చూడండని వీడియోను ప్రదర్శించారు. ‘జయము జయము చంద్రన్న’ అనే చంద్రబాబు భజన పాట ప్రదర్శించి సభ మొత్తం నవ్వులు పూయించారు. పోలవరం సందర్శనకు వెళ్లిన వారు చంద్రబాబుపై పాడిన భజన పాట వీడియోను సీఎం జగన్ అసెంబ్లీలో ప్రదర్శించారు. అందులో పోలవరం సందర్శన వచ్చిన కొంత మంది టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడారు. చంద్రబాబు కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని భజన చేశారు.
పోలవరం సందర్శన పేరుతో గత చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని సీఎం జగన్ విమర్శించారు. ‘చంద్రన్న భజన’ కోసం ఏకంగా రూ.83 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారని జగన్ సభలో ఆధారాలు చూపించి ఎండగట్టారు.
Also Read: హుందాతనం కోల్పోతున్న ఏపీ అసెంబ్లీ.. నేతల తీరే కారణమా?
ఈ వీడియో చూసి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మిగిలిన సభ్యులు పడి పడి నవ్వారు. ఈ పాట చూస్తూ నవ్వి నవ్వి అలిసిపోయిన సీఎం జగన్, చివరికి మధ్యలోనే ఆ వీడియోను ఆపివేయించారు.
ఈ వీడియో చూసిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇలా ప్రజల సొమ్ముతో బస్సులు పెట్టించి చంద్రబాబు భజన చేయించుకున్నారని విమర్శించారు. ఇక వీడియో చూసిన స్పీకర్ తమ్మినేని.. అప్పట్లో ఇన్ని నేరాలు, ఘోరాలు జరిగాయన్న సంగతి నాకు తెలియదు అంటూ ఘొల్లున నవ్వారు. సీఎం జగన్ అయితే నవ్వి నవ్వి అలిసిపోయారు. ఆ వీడియో తర్వాత సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
