
దుబ్బాక నియోజకవర్గంలో పొలింగ్ తుదిదశకు వచ్చింది. నియోజకవర్గంలోని చేగుంటలో దొంగ ఓటు నమోదైంది. అసలు ఓటరు రావడంతో అధికారులు గుర్తించారు. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు రావడంతో ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే అధికారులు తమ్ముడి ఓటును అన్న వేసినట్లు గుర్తించారు. తరువాత ఆ వ్యక్తికి టెండర్ ఓటుకు అనుమతించారు. లచ్చపేటలోని పొలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పరిశీలించారు. ఓటర్లు సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. కొందరు కరోనా విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను చూసి అభినందించారు.