
తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి పాత్ర కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొనియాడారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ విజయశాంతి ప్రజాదరణ ఉన్న మహిళ అని, గ్రామాల్లోని ప్రజలను ఆమె చైతన్యం చేశారన్నారు. తెలంగాణ వచ్చాక విజయశాంతిని పార్టీలు నిర్లక్ష్యం చేశారని తెలిపారు. అయితే కొన్ని రోజుల కిందట విజయశాంతి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆమె బీజేపీలో చేరుతోందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు ఇలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె పార్టీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.