https://oktelugu.com/

డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు?.. కేసీఆర్ ను బీజేపీ ఓడిస్తుందా?

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. నిజానికి నవంబర్ నెలలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ప్లాన్ చేసింది. అయితే హైదరాబాద్లో వరద కారణంగా ఎన్నికల నిర్వహణను వాయిదా వేసుకుంది. అయితే తాజా సమాచారం మేరకు డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. దీంతో తెలంగాణలో మరోసారి రాజకీయ వేడిరాజుకోనుంది. Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేటీఆర్‌‌ దూకుడు హైదరాబాద్లో వరద కారణంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను జనవరిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 05:02 PM IST
    Follow us on

    తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. నిజానికి నవంబర్ నెలలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ప్లాన్ చేసింది. అయితే హైదరాబాద్లో వరద కారణంగా ఎన్నికల నిర్వహణను వాయిదా వేసుకుంది. అయితే తాజా సమాచారం మేరకు డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తోంది. దీంతో తెలంగాణలో మరోసారి రాజకీయ వేడిరాజుకోనుంది.

    Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేటీఆర్‌‌ దూకుడు

    హైదరాబాద్లో వరద కారణంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను జనవరిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ కు సమాచారం అందించింది. అయితే తాజాగా దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఓటమిపాలైంది. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించాడు. దుబ్బాక ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలు పడకముందే ఎన్నికల నిర్వహించేలా ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది.

    ఈమేరకు ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. దీపావళి పండుగ తర్వాతి రోజు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుందనే టాక్ విన్పిస్తోంది. దీంతో టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే జీహెచ్ఎంసీని ఆయా వార్డుల్లో అభివృద్ధి పనుల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    Also Read: రాజకీయం.. రణం.. అమాయకుల ప్రాణాలు ఖతం

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అనే తెలుస్తోంది. దుబ్బాక ఫలితాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ రుచి చూపిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మేయర్ పీఠాన్ని దక్కించుకొని సీఎం కేసీఆర్ కు షాకిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం బీజేపీకి రాష్ట్రంలో పుంజుకొని చాన్స్ ఇవ్వకుండా ముందుస్తు పావులు కదుపుతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వరదసాయం సరిగా అందకపోవడంతో నగరవాసుల్లో టీఆర్ఎస్ వ్యతిరేక వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదనే టాక్ విన్పిస్తోంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో వేచిచూడాల్సిందే..!