
అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ వీరాభిమాని జనగామ జిల్లాకు చెందిన బస్సు కృష్ణ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన బుస్స కృష్ణ ట్రంప్‌కు వీరాభిమాని. తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్ని పెట్టి కొద్దిరోజులగా పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా ట్రంప్‌ను కలవడం తన చివరి కోరిక అని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న ట్రంప్ ఇండియా వచ్చినప్పుడు కలుస్తానని హామి ఇచ్చాడు. అయితే కొన్ని నెలల కిందట ట్రంప్ భారత్‌కు వచ్చినా కృష్ణను కలవకుండానే వెళ్లాడు. కాగా ఇటీవల ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలుసుకన్న కృష్ణ అప్పటి నుంచి ఆందోళనగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.