21 వరకు బయటికి రావొద్దు: డీజీపీ

ఈనెల 21వ తేదీ వరకు హైదరాబాద్‌ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు హెచ్చరించారు. ఈ నాలుగు రోజులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఆది, సోమ, మంగళ, బుధ వారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు […]

Written By: Suresh, Updated On : October 18, 2020 8:24 am
Follow us on

ఈనెల 21వ తేదీ వరకు హైదరాబాద్‌ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు హెచ్చరించారు. ఈ నాలుగు రోజులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసులను అప్రమత్తం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సేవలను అందించాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఆది, సోమ, మంగళ, బుధ వారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.