https://oktelugu.com/

బిగ్ బాస్ 4 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే…?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రేక్షకులు ముందుగానే ఊహించే వాళ్లు. అయితే ఈ సీజన్ లో మాత్రం ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. గత కొన్ని వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ నుండి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్న నేపథ్యంలో ఈ వారం మేల్ కంటెస్టెంట్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 18, 2020 / 08:35 AM IST
    Follow us on

    బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రేక్షకులు ముందుగానే ఊహించే వాళ్లు. అయితే ఈ సీజన్ లో మాత్రం ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. గత కొన్ని వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ నుండి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్న నేపథ్యంలో ఈ వారం మేల్ కంటెస్టెంట్ ను బిగ్ బాస్ ఎలిమినేట్ చేయనున్నారు.

    ఆరోవారం ఎలిమినేషన్ కు మొత్తం తొమ్మిది మంది బిగ్ బాస్ హౌస్ మేట్స్ నామినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున లాస్య, నోయల్, హారికలను సేవ్ అయినట్టు ప్రకటించాడు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ అరగుండు కొట్టించుకోవడంతో ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    మరోవైపు ఈ సీజన్ లో ముక్కూమొహం లేని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నారని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమ్మ రాజశేఖర్ కు అరగుండు గీయించటం ప్రేక్షకులకు నచ్చడం లేదు. ఇదేం పైత్యం బిగ్ బాస్..? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ ను ప్రశ్నిస్తున్నారు. కరోనా వల్ల ఈ సీజన్ లో పెద్ద సెలబ్రిటీలు బిగ్ బాస్ షో పట్ల ఆసక్తి చూపలేదని సమాచారం.

    అయితే సెలబ్రిటీల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల బిగ్ బాస్ షోకు రేటింగులు తగ్గుతున్నాయి. ఆరు కోట్ల ఓట్లు వస్తున్నాయని బిగ్ బాస్ లో నాగార్జున చెబుతున్నా వీకెండ్ ఎపిసోడ్ల రేటింగులు సైతం పదిని మించడం లేదు. బిగ్ బాస్ రేటింగులతో పోలిస్తే సీరియళ్లకే ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయని సమాచారం.