
మత కలహాలు సృష్టించి నెపాన్ని బీజేపీపై వేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కాళీమాత భూముల కబ్జా వెనుక డీసీపీ ప్రమేయం ఉందని చెప్పారు. హైకోర్టు ఆర్డర్‌ను కాదని డీసీపీ కింది కోర్ట్ ఆర్డర్‌ను.. అమలు చేయటానికి ప్రయత్నించారని మండిపడ్డారు. పాతబస్తీలో మత కలహాలు సృష్టించాలని, పోలీసులే ప్రయత్నించారని ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్‌పై ఎంఐఎం గూండాలు దాడికి ప్రయత్నించారని, బీజేపీ కార్యకర్తలే కాళీమాత ఆలయం భూమిని కాపాడారని రాజాసింగ్ తెలిపారు. కాళీమాత ఆలయాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. దేవాలయం భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు.