
పశ్చిమ బెంగాల్‌లో చంబల్ దొంగలు, రౌడీలు దూరారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ పేరును ఆమె ఎక్కడా ప్రస్తావించకుండానే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బెంగాల్‌ను మరో చంబల్‌లాగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. కొన్నిసార్లు పోలీసులు, మరికొన్ని సార్లు టీఎంసీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని మమతా బెనర్జీ అన్నారు.