తెలంగాణలో కరోనా స్ట్రేయిన్: వరంగల్ లో కలకలం: రాష్ట్రంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు 

తెలంగాణలో రాష్ట్రంలో  కరోనా స్ట్రేయిన్ కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొత్తరకం కరోనా నమోదు కావడంతో రాష్ర్టంలో అలజడి రేపుతోంది. గతంలో కరోనా ప్రారంభంలో దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణలో నమోదయ్యాయి.  కరోనా స్ట్రేయిన్ సైతం వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తికి రావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి.    వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 397 కరోనా కేసులు […]

Written By: Suresh, Updated On : December 29, 2020 10:23 am
Follow us on

తెలంగాణలో రాష్ట్రంలో  కరోనా స్ట్రేయిన్ కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొత్తరకం కరోనా నమోదు కావడంతో రాష్ర్టంలో అలజడి రేపుతోంది. గతంలో కరోనా ప్రారంభంలో దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణలో నమోదయ్యాయి.  కరోనా స్ట్రేయిన్ సైతం వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తికి రావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి.    వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 397 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,85,465గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,535గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,77,931 మంది కోలుకోగా ప్రస్తుతం 5,999యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.   వీరిలో 3,838 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో 24 గంటల్లో 42,737 పరీక్షలు నిర్వహించారు.