
హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయా డివిజన్లలలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జీలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమించారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవేళ్ల, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జులను నియమించారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి షబ్బీర్ అలీ, సికింద్రాబాద్ కు భట్టి విక్రమార్క, చేవెళ్లకు పొన్నం ప్రభాకర్, మల్కాజ్ గిరికి జీవన్ రెడ్డి, మెదక్ కు కుసుమకుమార్ ను నియమించారు. వచ్చే నెల 1న పోలింగ్ ఉన్నందున రేపటిలోగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.