https://oktelugu.com/

బిగ్ బాస్-4.. అఖిల్ కరివేపాకు.. అభిజిత్ ఊర మాస్.. నెట్టింట్లో గోలగోల..!

బిగ్ బాస్-4 ప్రారంభం నుంచి చాలా చప్పగా కొనసాగుతోంది. ఈ  షోలో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే బిగ్ బాస్ అలరించే టాస్కులు పెడుతుండటంతో క్రమంగా బుల్లితెర ప్రేక్షకులు కనెక్టయ్యారు. బిగ్ బాస్-4 ప్రస్తుతం 11వ వారానికి చేరుకుంది. చివరి దశకు బిగ్ బాస్-4 చేరుకుంటుండటంతో గేమ్ కూడా రసవత్తరంగా మారుతోంది. Also Read: కరోనాలోనూ మెగాస్టార్ పారితోషికంపైనే చర్చ..! బిగ్ బాస్-4 కేవలం వీకెండ్స్ మాత్రమే భారీ టీఆర్పీ తెచ్చుకుండగా మిగతా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 02:12 PM IST
    Follow us on

    బిగ్ బాస్-4 ప్రారంభం నుంచి చాలా చప్పగా కొనసాగుతోంది. ఈ  షోలో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే బిగ్ బాస్ అలరించే టాస్కులు పెడుతుండటంతో క్రమంగా బుల్లితెర ప్రేక్షకులు కనెక్టయ్యారు. బిగ్ బాస్-4 ప్రస్తుతం 11వ వారానికి చేరుకుంది. చివరి దశకు బిగ్ బాస్-4 చేరుకుంటుండటంతో గేమ్ కూడా రసవత్తరంగా మారుతోంది.

    Also Read: కరోనాలోనూ మెగాస్టార్ పారితోషికంపైనే చర్చ..!

    బిగ్ బాస్-4 కేవలం వీకెండ్స్ మాత్రమే భారీ టీఆర్పీ తెచ్చుకుండగా మిగతా రోజుల్లో మాత్రం అంతగా టీఆర్పీ రావడం లేదనే టాక్ విన్పిస్తోంది. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టే టాస్కులు పెడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ప్లాన్ కొంచెం వర్కౌట్ అయినట్లే కన్పిస్తోంది. 10వ వారంలో అఖిల్ ను ఎలిమినేట్ చేస్తున్నట్లు బిగ్ బాస్ సీక్రెట్ రూములో దాచిన సంగతి తెల్సిందే.

    10వ వారంలో బిగ్ బాస్ నుంచి మోహబూబ్ ఎలిమినేట్ కాగా 11వారానికి కెప్టెన్ గా అఖిల్ ను బిగ్ బాస్ ప్రకటించాడు. సీక్రెట్ రూం నుంచి అఖిల్ కంటెస్టులు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని నిన్నటి ఎపిసోడ్లో టార్గెట్ చేశాడు. ముఖ్యంగా అఖిజిత్-అఖిల్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. వీరద్దరి సహనం కోల్పోయి నువ్వేంతా.. అంటే నువ్వేంతా అనుకున్నారు.

    Also Read: వెంకీ – వరుణ్ ‘ఎఫ్ 3’కి ముహూర్తం ఖరారు !

    ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం అఖిల్ వర్సెస్ అభిజిత్ మధ్య వార్ నడుస్తోంది. అభిజిత్ పీఆర్ టీమ్ అఖిల్ పై విపరీతంగా ట్రోలింగ్ చేస్తోంది. దీనికి ధీటుగా అఖిల్ ఫ్యాన్స్ సైతం ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ట్వీటర్లో #Akhil, #Bigg bossTelugu4 హ్యాష్ ట్యాగ్స్ ఇండియా వైడ్ ట్రెండ్ మారాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    అఖిల్ ను అభిజిత్ ఫ్యాన్స్ కరివేపాకు అంటూ ట్రోల్ చేస్తూ అభిజిత్ ఊర మాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి ధీటుగా అఖిల్ ఫ్యాన్స్ అభిజిత్ ను చెత్త కంటెస్టెంట్.. బద్ధకస్థుడు అని ట్రోల్ చేస్తూ అఖిల్ ఫ్యాన్స్ అయినందుకు గర్వపడుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ కంటెస్టెంట్ల మధ్య చిచ్చుపెట్టగా హౌస్ అంతా రచ్చరంబోలాగా మారింది.