https://oktelugu.com/

జీహెచ్ఎంసీ ఎన్నికలపై రగడ..ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఎవరూ ఊహించని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అంతేకాదు.. ఎంత ఫాస్ట్‌గా షెడ్యూల్‌ రిలీజ్‌ చేశారో.. అంతే వేగంగా పోలింగ్‌ ప్రక్రియను ముగించబోతున్నారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. డిసెంబర్ 1న పోలింగ్‌, డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అంటే నోటిఫికేషన్ ప్రకటన వెలువడిన రోజకు ఓటింగ్ జరిగే రోజుకు మధ్య ఉన్నది 13 రోజులే. Also Read: ఆ అద్భుత దీపంపైనే కేసీఆర్ ఆశలు.. విజయశాంతి హాట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 / 02:04 PM IST
    Follow us on

    ఎవరూ ఊహించని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అంతేకాదు.. ఎంత ఫాస్ట్‌గా షెడ్యూల్‌ రిలీజ్‌ చేశారో.. అంతే వేగంగా పోలింగ్‌ ప్రక్రియను ముగించబోతున్నారు. రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. డిసెంబర్ 1న పోలింగ్‌, డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. అంటే నోటిఫికేషన్ ప్రకటన వెలువడిన రోజకు ఓటింగ్ జరిగే రోజుకు మధ్య ఉన్నది 13 రోజులే.

    Also Read: ఆ అద్భుత దీపంపైనే కేసీఆర్ ఆశలు.. విజయశాంతి హాట్ కామెంట్స్‌

    దీంతో ప్రతిపక్షాలు ఫైర్‌‌ అవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి కూడా గడువు లేకుండా ఈసీ ఇంత టైట్ షెడ్యూల్ విడుదల చేయడం మండిపడుతున్నాయి. ఈ విషయమై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలా మారిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తేదీలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండేలా ప్రకటించారని ఆయన విమర్శించారు. ఈ విషయమై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

    ఇప్పటికే దుబ్బాక విజయంతో ఉత్సాహంతో ఉన్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. గత ఎన్నికల్లో చేసిన మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయాలని టీఆర్ఎస్ ఉవ్విల్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఎన్నికలకు సన్నద్ధమయ్యే వ్యవధి లేకుండానే టీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అంతేకాదు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడంపైనా బీజేపీ మండిపడింది.

    Also Read: మోగిన గ్రేటర్ ఎన్నికల నగారా.. డిసెంబర్ 1 పోలింగ్.. పార్టీల బలాలివే

    ‘ఈవీఎంలను కాదని ఈసీ బ్యాలెట్ పేపర్‌కు వెళ్లింది. ఇది ఈసీ వెనుకబాటు ప్రయత్నమే. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. వంద రోజుల్లో ఒక ప్రణాళిక రూపొందిస్తాం. కబ్జాలు తొలగిస్తాం.. చెరువులను పునరుద్ధరిస్తాం. రోడ్ల మీద గుంతల్లేకుండా చేస్తాం అని టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే హామీలను ఇచ్చింది. ఐదేళ్ల నుంచి ఎవరికీ ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో వరదలొస్తే.. సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు’ అని బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి మండిపడ్డారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్