
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగుళూరు ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. ఆ పార్టీ ఆధ్వర్యంలో అనుమతి లేకున్నా పార్టీ కార్యకర్తలతో ఉస్మానియా యూనివర్సిటీలోకి బుధవారం వెళ్లారు.వర్సిటీలోకి పాదయాత్రగా వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పార్టీ నాయకులు గోడ దూకి వెళ్లారు. ఆ తరువాత అనుమతి లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించారు. దీంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తేజస్వీ సూర్యపై ఐపీసీ 447, హైదరాబాద్ సీపీ యాక్ట్ 21 /77 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.