తెలంగాణ ఆర్టీసీ కార్గో- పార్శిల్ సేవల్లో మరో ముందడుగు పడింది. పార్శిళ్లను ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్‌లో డోర్ డెలివరీ సేవలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ గత 3 నెలలుగా కొరియర్ పార్శిళ్ల సేవల్లో తెలంగాణ ఆర్టీసీ వేగవంతమైన వృద్ధి సాధించిందని వివరించారు. ఇప్పటి వరకూ 12 లక్షల 50వేలకు పైగా సరకు పార్శిళ్లను రవాణా చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే ఈ సంఖ్య 25 లక్షలకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Cargo services at the customers home
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com