
రాష్ట్రంలో ఇప్పటివరకు 9 లక్షల 18 వేల 664 మంది రైతుల వద్ద నుండి కనీస మద్దతు ధర చెల్లించి సుమారు రూ. 11 వేల కోట్ల విలువ గల 40.06 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి స్పందిస్తూ.. కొనుగోలు చేసిన ఈ మొత్తం ధాన్యంలో సన్నరకం వరి ధాన్యము 14.81 లక్షల మెట్రిక్ టన్నులు కాగా దొడ్డు ధాన్యము 25.25 లక్షల మెట్రిక్ టన్నులు అని తెలిపారు.