
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మెనీఫెస్టోను గురువారం విడుదల చేయనుంది. నగరంలో బీజేపీ ఇప్పటికే ప్రచారం ఉధృతం చేసింది. ఇందులో భాగంగా నిన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటించారు. నేడు మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ హైదరాబాద్ రానున్నారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ మెనీఫెస్టోను విడుదల చేయనున్నారు. కాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ లు తమ మెనిఫెస్టోలను ఇదివరకే ప్రకటించాయి. మరోవైపు ప్రచారంలో పార్టీల నాయకులు అల్లర్లు చెలరేగేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇక ప్రస్తుతం భద్రతా కారణాల వలన ఎన్నికలు నిర్వహించొద్దని కోర్టులో పిల్ వేశారు.