
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అక్టోబర్ రెండో వారంలో బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు బతుకమ్మ చీరలు చేరాయి. 287 డిజైన్లతో బంగారు, వెండి జరీ అంచులతో ఉన్న చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి చీరల పంపిణీకి రూ.317.81 కోట్లు వెచ్చించినట్లు ఇప్పటికే స్థాకి మంత్రి కేటిఈర్ వెల్లడించారు. కాగా మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లో పాల్గొన్నారు.