
సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతుంటాయి. దర్శకుడు-హీరో.. హీరో-హీరోయిన్లు.. దర్శకుడు-నిర్మాత.. హీరో-నిర్మాణ సంస్థ.. దర్శకుడు-నిర్మాణ సంస్థ ఇలాంటి కాంబినేషన్లను చూస్తునే ఉంటున్నాం. ఈ కాంబినేషన్లోలో సినిమా వస్తుందంటే ఆ సినిమా హిట్టో.. ఫట్టో ముందుగానే అభిమానులు చెప్పేస్తుంటారు. ఇక వారిది ఇంతకముందే హిట్టు కాంబినేషన్ అయితే మాత్రం ప్రేక్షకులు ఏమి ఆలోచించకుండానే థియేటర్లు పరుగులు పెడుతుంటారు.
Also Read: ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సెట్ లో కరోనా !
ఇండస్ట్రీలో హీరో-హీరోయిన్లు.. హీరో-నిర్మాత కాంబినేషన్లు ఎక్కువగా కన్పిస్తుంటాయి. కొన్నిసార్లు దర్శకుడు-నిర్మాత కాంబినేషన్లు చూస్తుంటాం. అయితే దర్శకుడు ఒకే నిర్మాణ సంస్థలో ఎక్కువగా సినిమాలు చేయడం అనేది మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ఇది ఎక్కువగా ఉన్నప్పటికీ రానురాను ఇది తగ్గముఖం పడుతూ వస్తోంది.
ప్రస్తుతం సినీ పరిశ్రమలోకి కొత్త నిర్మాణాలు సంస్థలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇటీవలీ కాలంలో కొన్ని నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఒకే దర్శకుడితో పని చేస్తూ విజయాలను అందుకుంటున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ లో దర్శకుడు తివిక్రమ్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో దర్శకుడు సుకుమార్, కొరటాల శివ సినిమాలు చేస్తూ పోతున్నాయి. ఇటీవల కాలంలో కొరటాల శివ మైత్రీకి కేవలం సలహాదారుడిని మాత్రమే ఉంటున్నట్లు తెలుస్తోంది.
‘రంగస్థలం’.. ‘పుష్ప’ మూవీలతో మైత్రీకి సుకుమార్ ఆస్థాన దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ‘పుష్ప’ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే సుకుమార్ సైతం మైత్రీ మూవీ మేకర్స్ కు హ్యండిచ్చినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. ‘పుష్ప’ మూవీ చేస్తుండగానే మరో నిర్మాతతో సినిమా చేస్తున్నట్లు సుకుమార్ ప్రకటించాడు. దీంతో సుకుమార్ మైత్రీకి ఆస్థాన దర్శకుడిగా ఉండేందుకు ఇష్టపడటం లేదని టాక్ విన్పిస్తోంది.
Also Read: విజువల్ వండర్.. అవతార్-2లో ప్రత్యేకత అదేనా?
అయితే మైత్రీ సంస్థ మహేష్ బాబు ప్రాజెక్టు విషయంలో చాలా డ్రామా జరిగిందని.. అప్పుడే సుకుమార్ వేరే నిర్మాణ సంస్థతో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు టాక్ విన్పిస్తుంది. అయితే చివరికీ ‘పుష్ప’ పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. దర్శకులను ఆకట్టుకునేందుకు పలు నిర్మాణ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తుండటంతో వారంతా అటువైపు మరలుతున్నారు.
అంతేకాకుండా ఒకే నిర్మాణ సంస్థల్లో అదే పనిగా పనిచేస్తే క్రియేటివ్ డిఫెరెన్స్ వచ్చి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని డైరెక్టర్లు భావిస్తున్నారు. దీంతో దర్శకులంతా త్రివిక్రమ్ లా ఒకే నిర్మాణ సంస్థకే కట్టుబడి పోకుండా వచ్చినా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతున్నారు.