https://oktelugu.com/

హైదరాబాద్‌లో మరో విషాదం

హైదారాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల కారణంగా ఎంతో మంది కొట్టుకుపోయారు. ఇళ్లు కూలి మరికొందరు మరణించారు. అయితే వర్షాలు, వరద తగ్గినా నాలాల వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగానే ఉంది. తాజాగా మంగళవారం నాలాలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందారు. శరద్‌నగర్‌కు చెందిన సరోజ అనే 80 ఏళ్ల మహిళ ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లింది. సరూర్‌నగర్‌ చెరువు కట్ట కింద కోదండరాంనగర్‌ నాలాలో ప్రమాదవశాత్తూ అందులో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 3, 2020 / 12:33 PM IST
    Follow us on

    హైదారాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల కారణంగా ఎంతో మంది కొట్టుకుపోయారు. ఇళ్లు కూలి మరికొందరు మరణించారు. అయితే వర్షాలు, వరద తగ్గినా నాలాల వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగానే ఉంది. తాజాగా మంగళవారం నాలాలో పడి ఓ వృద్ధురాలు మృతి చెందారు. శరద్‌నగర్‌కు చెందిన సరోజ అనే 80 ఏళ్ల మహిళ ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లింది. సరూర్‌నగర్‌ చెరువు కట్ట కింద కోదండరాంనగర్‌ నాలాలో ప్రమాదవశాత్తూ అందులో పడింది. ఆమె మృతదేహం చైతన్యపురి హనుమాన్‌నగర్‌ నాలాలో బయటికి రావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.