ఆన్లైన్ లోన్ యాప్ నకు మరొకరు బలయ్యారు. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్న ఓ వ్యక్తి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చంద్రమోహన్ లోన్ తీసుకుని డబ్బు కట్టలేదన్న విషయాన్ని ఆయన సన్నిహితులందరికి మెసేజ్ పంపించారు. దీంతో మనస్థాపానికి గురైన చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో పలువురు ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా లోన్ యాప్ నిర్వహిస్తున్న పలువురు పట్టుబడ్డారు. అయినా కొందరికి వేధింపులు ఆగడం లేదు.