
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 925 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,62,653 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,426గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,49,157 మంది కోలుకోగా ప్రస్తుతం 13,367 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 9,714 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. కాగా 24 గంటల్లో 42,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు స్వల్పంగా కేసులు పెరిగాయి. పట్టణాలో స్వల్పంగా కేసులు నమోదు కావడంతో జాగ్రత్తలుపాటించాల్సిందేనని వైద్యాధికారులు సూచిస్తున్నారు.