https://oktelugu.com/

బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..?

ప్రారంభంలో ఆకట్టుకోని బిగ్ బాస్ 4వ సీజన్ ఆ తరువాత గేమ్స్, ఎంటర్ టైన్ మెంట్ ఫర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ప్రతీ వారం ఎవరో ఒకరు కంటెస్టెంట్ ఎలిమినేట్ కాక తప్పదు. ఇప్పటి వరకు 10 వారాలు గడిచిపోయాయి. వారం వారం ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా ఈ వారం బలమైన కంటెస్టెంట్లు లాస్య, అభిజిత్, హారిక, అరియానా, మోనాల్, సొహైల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 / 08:28 AM IST
    Follow us on

    ప్రారంభంలో ఆకట్టుకోని బిగ్ బాస్ 4వ సీజన్ ఆ తరువాత గేమ్స్, ఎంటర్ టైన్ మెంట్ ఫర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ప్రతీ వారం ఎవరో ఒకరు కంటెస్టెంట్ ఎలిమినేట్ కాక తప్పదు. ఇప్పటి వరకు 10 వారాలు గడిచిపోయాయి. వారం వారం ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు. మరి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా ఈ వారం బలమైన కంటెస్టెంట్లు లాస్య, అభిజిత్, హారిక, అరియానా, మోనాల్, సొహైల్ లు ఎలిమినేట్ లిస్టులో ఉన్నారు. వారి ఫర్ఫామెన్ష్ ఎలాగుందో చూద్దాం..

    Also Read: 20 ఏళ్ల కిందట.. రాజమౌళి ‘బాహుబలి’ కథ సీక్రెట్ తెలిసింది

    సోహైల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫర్ఫామెన్స్ ఇస్తున్నాడు. దీంతో ఆయనను ఎలిమినేట్ చేసే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. అభిజిత్ కు ఈ వారం ఓట్లు బాగానే పడ్డాయి. అందరికంటే ఎక్కువగా ఆయనకే రావడం గమనార్హం. అభిజిత్ మొదటి ప్లేసులో ఉంటే సోహైల్ రెండో స్థానంలో ఉన్నారు.

    ఇక హరియానా నిత్యం ఉత్సాహంగా కనిపిస్తోంది. హౌజ్ లో అందరికంటే ఎక్కువగా ఓట్లు కొట్టేసింది. గేమ్ లోనే, ఎంటర్ టైన్ మెంట్ లోనూ ఆమె ఫర్ఫమెన్స్ కు ఫ్యాన్ష ఫిదా అయ్యారు. దీంతో ఆమెను మహిళల్లో మొదటి స్థానంలో నిలబెట్టారు. మోనాల్ విషయానికి వస్తే ఆమెకు బిగ్ బాస్ అండదండలున్నాయి. అఖిల్ ఫ్యాన్స్ మొత్తం మోనాల్ కు ఓట్లు వేయడం విశేషం.

    Also Read: బిగ్ బాస్: ఎవరు ఎంతవరకు మోసారో !

    అయితే వీరిందరి కంటే హారిక, లాస్యలు కాస్త వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిని పోలిస్తే లాస్య కంటే హారికకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో లాస్య ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లాస్యకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువున్న ఓట్లు మాత్రం తక్కవే వచ్చాయి. అయితే ఈ ఆదివారం ఎవరు హౌజ్ నుంచి బయటకు వెళుతారో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్