
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులు శాసన మండలిలోనూ ఆమోదం పొందాయి. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, ఇండియన్ స్టాంపు బిల్లు, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సవరణ బిల్లులకు నిన్న శాసనసభలో ఆమెదం తెలిపారు. తాజాగా శాసన మండలిలోనూ ఆమోదించినట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. అనంతరం శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నాలుగు బిల్లుల సవరణ కోసం నిన్న జరిగిన సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీలో చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు.