తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే మరింత తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,993గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,554గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,81,400 మంది కోలుకోగా ప్రస్తుతం 5,039యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,793 మంది […]
Written By:
, Updated On : January 5, 2021 / 09:47 AM IST

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే మరింత తగ్గాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,87,993గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,554గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,81,400 మంది కోలుకోగా ప్రస్తుతం 5,039యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,793 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఒక్కరోజే 42,485 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.