https://oktelugu.com/

మహేష్ కి ‘రేణూ దేశాయ్’ వదిన కాదు, అక్కే !

సూపర్ స్టార్ మహేష్ బాబుకి, పవర్ స్టార్ మాజీ సతీమణి ‘రేణూ దేశాయ్’ వదినగా నటించబోతుందని గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. అసలు మహేష్ సినిమాలో వదిన పాత్రనే లేదు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ సిస్టర్ పాత్ర మాత్రమే ఉంది. ఆ పాత్రలోనే రేణూ దేశాయ్ నటించబోతుంది. ఓపెనింగ్ సీన్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. […]

Written By:
  • admin
  • , Updated On : January 5, 2021 / 09:43 AM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబుకి, పవర్ స్టార్ మాజీ సతీమణి ‘రేణూ దేశాయ్’ వదినగా నటించబోతుందని గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. అసలు మహేష్ సినిమాలో వదిన పాత్రనే లేదు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ సిస్టర్ పాత్ర మాత్రమే ఉంది. ఆ పాత్రలోనే రేణూ దేశాయ్ నటించబోతుంది. ఓపెనింగ్ సీన్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. సినిమాలో ఆమె ఒక ఉన్నత బ్యాంక్ అధికారి అని.. విలన్ పన్నిన ఉచ్చులో ఆమె బలి అవుతుందని.. తనకు తల్లి లేని లోటును తీర్చిన తల్లి లాంటి అక్క చావుకి కారణం అయినా విలన్ ను ఎలా అంతం చేశాడు అన్నదే సినిమా మెయిన్ పాయింట్ అట.

    Also Read: హాట్ ఫొటోలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్

    ఈ క్రమంలో భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల ఆధారంగా అల్లిన కథతో సినిమా ప్లే కేంద్రీకృతమై ఉంటుందట. ఇక వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుందని.. ఆలాగే మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా చాల ఆసక్తికరంగా నడుస్తోందని తెలుస్తోంది. నేటి రాజకీయ నేపథ్యం కూడా ఎంచుకున్నారని.. సినిమాలో రాజకీయాలను ప్రస్తావించబోతున్నారని సినీ సర్కిల్స్ లో టాక్ ఉంది.

    Also Read: హీరోగారితో జ్వాలాగారి పెళ్లి ఎప్పుడో ?

    ఇక అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో కొంతభాగం లవర్ బాయ్‌ గా నటించనున్నాడు. పైగా ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా జ‌న‌వ‌రి నుంచి జ‌ర‌గాల్సిన అమెరికా షెడ్యూల్ వాయిదా ప‌డటంతో దర్శకుడు స్క్రిప్టుని మ‌రింత ప‌ర్‌ఫెక్ట్ గా తీర్చిదిద్దుకోవ‌డానికి క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్