https://oktelugu.com/

చెల్లెమ్మా.. తస్మాత్ జాగ్రత్త – ఎన్టీఆర్

ఈ డిజిటల్ లైఫ్ లో సోషల్ మీడియా చాలామందికి మేలు చేసినా.. మరికొంతమంది జీవితాలను మాత్రం నాశనం చేసింది. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు ఫేస్ బుక్ ప్రేమలో పడి, మాయగాళ్ల చేతిలో మానసికంగా నలిగిపోతూ తమను తామూ చంపుకున్న దురదృష్ట సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. ఇలా ఒక పక్క జీవితాలు నాశనం అవుతున్నా.. ఫేస్ బుక్, ఆన్ లైన్ చాటింగ్‌ మోసాల నుండి మాత్రం యువత బయటపడటం లేదు. ఇప్పటికీ అమాయక అమ్మాయిలు దుర్మార్గుల చేతిలో […]

Written By:
  • admin
  • , Updated On : January 5, 2021 / 09:58 AM IST
    Follow us on


    ఈ డిజిటల్ లైఫ్ లో సోషల్ మీడియా చాలామందికి మేలు చేసినా.. మరికొంతమంది జీవితాలను మాత్రం నాశనం చేసింది. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు ఫేస్ బుక్ ప్రేమలో పడి, మాయగాళ్ల చేతిలో మానసికంగా నలిగిపోతూ తమను తామూ చంపుకున్న దురదృష్ట సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. ఇలా ఒక పక్క జీవితాలు నాశనం అవుతున్నా.. ఫేస్ బుక్, ఆన్ లైన్ చాటింగ్‌ మోసాల నుండి మాత్రం యువత బయటపడటం లేదు. ఇప్పటికీ అమాయక అమ్మాయిలు దుర్మార్గుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతున్నారు. ఇలాంటి మోసాల పట్ల, అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేసి మరీ చెబుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

    Also Read: హీరోగారితో జ్వాలాగారి పెళ్లి ఎప్పుడో ?

    ఫేస్‌బుక్ ప్రేమల మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నాడు ఎన్టీఆర్. ఫేస్‌బుక్‌ను వాడుకుంటూ మోసాలకు పాల్పడే ముఠాలు చాలానే ఉన్నాయని, వాటి బారినపడొద్దంటూ తెలంగాణ పోలీసులు రూపొందించిన వీడియోను ఎన్టీఆర్ ప్రమోట్ చేయడం, ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి మరో నిదర్శనం. ఇక పోలీసులు రూపొందించిన ఈ వీడియోలో అమ్మాయిలు ఎలా ఫేస్ బుక్ ప్రేమలో పడి మోసపోతున్నారో.. ముఖ్యంగా అపరిచత వ్యక్తులతో చాటింగ్ చేసి తమ వ్యక్తిగత విషయాలు షేర్ చేసి చివరకు ఎలా బలి అవుతున్నారో.. కళ్ళకు కట్టినట్లు చూపించారు.

    ఈ వీడియో ద్వారా ప్రవైట్ ఫోటోలు షేర్ చేస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో అమ్మాయిలకు ఈ వీడియో పక్కాగా చూపించింది. నిజానికి కొన్ని ముఠాలు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతో అమ్మాయిల్ని బుట్టలో వేసుకుని, వారిని ప్రేమలో పడేసి.. వారి న్యూడ్ ఫోటోలు తీసుకుని.. ఆపై బ్లాక్ మెయిల్ చేసి, చివరకు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. ఇలాంటి వారి పట్ల అమ్మాయిలు తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలూ.. దయచేసి ఇప్పటికైనా ఎవ్వరిని నమ్మి మీ పర్సనల్ ఫోటోల్ని షేర్ చేయకండి. ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ళే బ్లాక్ మెయిల్ చేస్తారు.

    Also Read: హాట్ ఫొటోలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్

    మోసం ఎప్పుడూ నమ్మకంలో నుండే పుడుతుంది, జాగ్రత్త. ఇక ఈ వీడియోను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్.. ‘‘చెల్లెమ్మా నా మాట విను.. ఫేస్‌బుక్ మోసాల పట్ల తస్మాత్ జాగ్రత్త’’ అని హెచ్చరించిన ప్రతి చెల్లికి చేరేలా ఈ వీడియోని షేర్ చేద్దాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్