
తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 1,451 కేసులు నమోదయ్యయి. నిన్న ఒక్కరోజే 9 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,20, 675 కాగా మరణించిన వారి సంఖ్య 1265గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తతుతం 22,774 యాక్టివ్ కేసులు ుండగా 1,96,636 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తతం తెలంగాణలో రికవరీ రేటు 89.1 శాతం ఉండగా దేశవ్యాప్తంగా 87.7 శాతం ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 42,497 పరీక్షలు చేయగా ఇప్పటి వరకు మొత్తం 37,89,460కి సంఖ్యకు చేరింది.