
దేశంలో కొత్తగా 62,212 కేసులు నమోదయ్యయి. 24 గంటల్లో 837 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,32,681కి చేరింది. మరణించిన వారి సంఖ్య 1,12,998కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 70,816 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 65,24,596 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. కేసుల సంఖ్య ఒక రోజు తగ్గి మరో రోజు పెరగడం అయోమయానికి గురి చేస్తోంది. మొత్తంగా కేసుల సంఖ్య తగ్గినట్లు కనిపిస్తున్నా మరణాల సంఖ్య అదే స్థాయిలో ఉంది.