
తెలంగాణ రాష్ట్ర హోంశాక మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి చెందారు. కొంతకాలం కిందట ఆయనకు కరోనా సోకి తగ్గినా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి 12 గంటలకు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించడానికి వెళ్లారు. ఆయన పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కోవిడ్ తగ్గినప్పటికీ ఊపిరితిత్తుల్లో న్యూమోనియా రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది.