హైదరాబాద్‌లో ఇటీవల బోరుబండలో భూకంప ప్రకంపణలు ఆందోళన రేకెత్తించాయి. పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి నిద్రలేని రాత్రిని గడిపారు. అయితే ఈ శబ్దాలకు కారణం భూమి పొరల్లో వచ్చిన ఒత్తిడి, పగుళ్లేనని ఎన్‌ఆర్ శాస్త్రవేత్త నగేశ్ తెలిపారు. ఇష్టానుసారం బోర్లు వేయడం, భూమి లోపల నీటి ఆనవాల్లు లేకపోవడంతో భూమిలో పొరలు కదులుతున్నాయన్నారు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు కూడా భూ ప్రకంపనలకు కారణమేనన్నారు. ఒకసారి భూకంపం వస్తే కొద్దిరోజుల పాటు దీని ప్రభావం ఉంటుందన్నారు.