https://oktelugu.com/

సెలూన్లకు ఉచిత విద్యుత్: టీఆర్ఎస్ మెనిఫెస్టో విడుదల

హైదరాబాద్ లో జరిగే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా సోమవారం అధికార టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం అని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారన్నారు. ఇప్పటికే నగరాన్ని ఎంతో అభివ్రుద్ధి చేశామన్నారు. మరింత అభివ్రుద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ సందర్భంగా మెనిఫెస్టోలోని వివరాలను వెల్లడించారు. 1. […]

Written By: Velishala Suresh, Updated On : November 23, 2020 2:46 pm
Follow us on

హైదరాబాద్ లో జరిగే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా సోమవారం అధికార టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం అని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారన్నారు. ఇప్పటికే నగరాన్ని ఎంతో అభివ్రుద్ధి చేశామన్నారు. మరింత అభివ్రుద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ సందర్భంగా మెనిఫెస్టోలోని వివరాలను వెల్లడించారు.

1. డిసెంబర్ నుంచి క్షౌరశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా.
2. నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా.
3. లాండ్రీలకు , దోభీలకు ఉచిత విద్యుత్
4. లాక్ డౌన్ కాలంలో మోటార్ వాహన పన్ను సుమారు రూ.267 కోట్ల రద్దు.
5. జీహెచ్ఎంసీ కోసం సమగ్రమైన చట్టం
6. రాష్ట్రంలో రూ.10 కోట్ల లోపు బడ్జెట్ తో తీసే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్ మెంట్